Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నానో యూరియాపై దృష్టి సారించాలి..

నానో యూరియాపై దృష్టి సారించాలి..

- Advertisement -

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్..
నవతెలంగాణ – డిచ్ పల్లి

నానో యూరియా వాడకంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ పేర్కొన్నారు. శనివారం డిచ్ పల్లి మండలం లోని బర్దిపూర్ సహకార సొసైటీ నుంచి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ గోవింద్ మాట్లాడుతూ .. భవిష్యత్ లో నానో యూరియా వాడకం పెంచాలని,ఇదే విషయమై రైతులకు అవగాహన కల్పించే విధంగా చూడాలని సహకార సొసైటీ చైర్మన్ సొసైటీ చైర్మన్ కోసరాజు రామకృష్ణ ,సోసైటి సిఈఓ, సిబ్బందిని కోరారు. అంతకు ముందు యూరియా నిలువలపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం సొసైటీ పరిధిలో యూరియా కొరత లేదని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -