- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగుల్ గావ్ గ్రామంలో శ్రావణమాసం సోమవారం పురస్కరించుకొని గ్రామస్తుల ఆధ్వర్యంలో మహా అన్నదాన ప్రసాదం హనుమాన్ దేవాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని పేదలకు, గ్రామస్తులందరికీ అన్నప్రసాదం అందించారు. శ్రావణమాసం సందర్భంగా గ్రామంలో నిత్యము కీర్తనలు, భజనలు నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.
- Advertisement -