నవతెలంగాణ – ఆర్మూర్
డివిజన్ ప్రాంత రైతాంగం ప్రతి సంవత్సరం పచ్చని పంట పొలాలను వదిలి రోడ్లపైకి రావాల్సి వస్తుంది. గత 15 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉన్న నిర్దిష్టమైన మార్కెటింగ్ విత్తన విధానాన్ని అమలు చేయడంలో పాలకులు, విఫలమవుతున్నారు అని విమర్శ సర్వర్త వ్యక్తం అవుతుంది. ఎర్ర జొన్న పంటకు గిట్టుబాటు కావడం లదని దళారుల మోసాలకు చెక్ పెట్టాలని రైతులు ఉద్యమ బాట పడుతున్నారు. నియోజకవర్గంలోని నందిపేట్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద శుక్రవారం రైతన్నలు రోడ్డెక్కినారు.
యూరియా దొరకడం లేదని , ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ ను రద్దు చేయాలని రైతుల రోడ్డెక్కారు. యూరియా ఎరువు కొరతపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నారు. లక్కంపల్లి చిమ్రాజ్ పల్లి నందిపేట లకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం గంటల తరబడి వేచి చూసినా ఎరువు అందకపోవడం తో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా పంపిణీలో అమలు చేస్తున్న యూరియా యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆరోపించారు. వెంటనే యూరియా యాప్‌ను రద్దు చేసి, రైతులకు నేరుగా ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళనతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. గత 15 రోజుల నుండి యూరియా బస్తాలు రావడం లేదని, వేసిన వరి పంట చివరి దశలో ఉందని, ఇప్పుడు యూరియా వేయకుంటే పెట్టిన పెట్టుబడి సైతం రాదని అన్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై శ్యామ్ రాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సమస్యను పరిష్కరించాలని రైతన్నలు కోరుతున్నారు.



