Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆహార భద్రత నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి

ఆహార భద్రత నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి

- Advertisement -

జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  

జిల్లాలో ఆహార భద్రత నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం రోజు మినీ మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రీక్ లెవెల్ ఫుడ్ సేఫ్టీ అడ్వైజరీ కమిటీ సమావేశం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,  రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధ్యక్షతన  సంబంధిత జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. 

 ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లడుతూ.. జిల్లాలో ప్రజలకు అందించే ఫుడ్ విధానాలపై ఈ కమిటీ విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకుంది ప్రజలకు, ఆహారం అందించే హోటల్ లోను, హాస్టల్లోనూ పాఠశాలలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనూ పాల కేంద్రాలలోనూ బేకరీలలోనూ, స్వీట్ హౌస్ లోనూ ఇతరత్ర కేంద్రాలలో అందించే ఆహార పదార్థాలలో ఎలాంటి కల్తీ జరగకూడదని రంగులను కానీ, నాణ్యత లోపించిన పదార్ధాలను కానీ, నూనెలను కానీ కుళ్లిపోయిన పదార్థాలను కానీ కల్తీ అయిన పాలను కానీ కల్తీ అయిన సీట్లను కానీ కూరగాయలకు రంగులు అద్దడం కానీ చేసిట్లయితే చట్టరీత్యా తప్పక శిక్ష అనుభవించాల్సి వస్తుందని ప్రజలకు అందించే ఆహార పదార్థాలు కల్తీ లేకుండా ఆరోగ్యవంతమైనవిగా   శుభ్రమైనవిగా నాణ్యమైనవిగా అందించాలి.

లైసెన్స్ పొందిన ఆహార పదార్థాలను ప్రజలకు అందించాలని ఆర్గానిక్ ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు దాని వైపు మొగ్గు చూపాలని ప్రజలు ఆ పంటలను అత్యధికంగా పండించుటకు ప్రయత్నించాలని ఆహారం కల్తీ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు రోగాలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలకు అందించే ఏ తిను పదార్ధాలైనా కల్తీ లేకుండా నాణ్యమైనవిగా శుభ్రమైనవిగా ఆరోగ్యవంతమైనవిగా అందించాలని లేనిచో వారిపైన చట్టరీత్యా శిక్షలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అందరి సమిష్టి బాధ్యత, సురక్షిత ఆహారం అందించడంలో అధికారులు అందర సమన్వయంగా కృషి చేయాలని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి,జిల్లా సేఫ్టీ అధికారి స్వాతి, జిల్లా వ్యవసాయ అధికారి రమణా రెడ్డి, జిల్లా వైద్య అధికారి మనోహర్, జిల్లా విద్యా అధికారి సత్యనారాయణ  సివిల్ సప్లై అధికారి రోజా రాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -