ఆవనూనెతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆవనూనెను వంటకాల్లో కూడా ఉపయోగిస్తుంటారు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆవ నూనెలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో బహుళ అసంతప్త, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచివని నిపుణులు చెబుతుంటారు. ఆవనూనెలో ఉండే ఒమేగా-3, 6 వంటి సంతప్త కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. చర్మాన్ని సహజంగా మాయిశ్చరైజ్ చేయడంలో కూడా ఆవాల నూనె ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆవాల నూనెను అరికాళ్లకు అప్లై చేసుకోవడం వల్ల కండరాలకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంతో ఉపయోగ పడుతుంది. ఎక్కువ సేపు నడిచే వారు, నిలబడి పనిచేసే వారు రాత్రుళ్లు పడుకునే ముందు ఆవాల నూనెతో మసాజ్ చేసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. నిద్రలేమి సమస్య కూడా దూరమవు తుంది. హాయిగా నిద్రపడు తుంది.
నెలసరి సమయంలో కనిపించే కడుపు తిమ్మిరి, నొప్పి వంటి సమస్యలకు ఆవాల నూనె బాగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఆవాల నూనెను అరికాళ్లకు మసాజ్ చేసుకోవడం వల్ల పీరియడ్స్ క్రాంప్స్ నుంచి ఉపశమనం పొందొచ్చు.
ఆవనూనెతో అరికాళ్ల మసాజ్…
- Advertisement -
- Advertisement -