సోషల్ మీడియా ఇన్ల్ఫూయెన్సర్ యామిని ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు యువ దర్శకుడు రతన్ రిషి. ఆయన గతంలో రూపొందించిన ‘ఉత్తర, ఆర్టిస్ట్’ మూవీస్ మంచి ఫిలింమేకర్‌గా పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తన మూడో చిత్రంగా హీరోయిన్ సెంట్రిక్ కథతో ‘క్వీన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. కాళకేయ ప్రభాకర్, అజరు ఘోష్ విలన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్ర కోసం నైన్టీస్‌లో హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ చూస్తే ప్రస్తుత సొసైటీతో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రాళ్లమీద పేర్లతో కొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. తాజ్ మహల్ మీద గుర్తులుగా మరికొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. కానీ దేశపు మనుగడను మార్చే కొత్త శాసనంగా ఈ ప్రేమకథ అని చెబుతూ.. భారత రాజ్యాంగం, ఆర్‌టీఐ యాక్ట్, పీపుల్ సెంట్రిక్ గవర్నమెంట్ సిస్టమ్, యాక్ట్ ఆఫ్ లవ్ వంటివి చూపించడం ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ పై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. తను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ… అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో స్ఫూర్తి కలిగించేలా చూపించనున్నారు దర్శకుడు రతన్ రిషి. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఆర్ట్ – భార్గవ నౌండ్ల, కొరియోగ్రఫీ – జేడీ మాస్టర్, డీవోపీ – సరస్, మ్యూజిక్ – యతీష్, ఎడిటింగ్ – ఆర్ ఎం విశ్వనాథ్ కుచనాపల్లి.
ప్రేమించిన వ్యక్తి కోసం..
- Advertisement -
- Advertisement -



