Thursday, February 12, 2026
E-PAPER
Homeసినిమాఅన్ని వర్గాల ప్రేక్షకుల కోసం..

అన్ని వర్గాల ప్రేక్షకుల కోసం..

- Advertisement -

అర్జున్‌ దర్శకత్వంలో నిరంజన్‌, ఐశ్వర్య అర్జున్‌ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ మీద అర్జున్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ధ్రువ సర్జా స్పెషల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల14న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత, దర్శకుడు అర్జున్‌ మీడియాతో సంభాషించారు. ఇది యూనివర్సల్‌ కాన్సెప్ట్‌. ఏ భాషలో చేసినా, తీసినా, చూసినా అందరికీ రిలేట్‌ అవుతుంది. ఇదొక ఫీల్‌ గుడ్‌ సబ్జెక్ట్‌. అన్ని భాషల్లో వర్కౌట్‌ అవుతుంది. తెలుగులోనే మా అమ్మాయిని పరిచయం చేయటానికి కారణం నాకు ఈ పరిశ్రమ ఎంతో ఇచ్చింది.

తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ప్రేమిస్తుంటారు. అందుకే ఐశ్వర్యని ఇక్కడి నుంచే లాంచ్‌ చేయాలని అనుకున్నాను. ఇదొక మెచ్యూర్డ్‌ స్టోరీ. ఇందులో కేవలం ప్రేమ కాదు. ఇందులో ఎన్నో రకాల ఎమోషన్స్‌, అంశాలున్నాయి. ఈ సినిమాని చూస్తే అవేంటో ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఫ్యామిలీ, దేశాన్ని ప్రేమించడం కూడా ఓ దేశ భక్తి అవుతుంది. సెన్సార్‌ బోర్డ్‌ మా సినిమాను చూసి చాలా ఎమోషనల్‌ అయ్యారు. మంచి సినిమా తీశారు అని నన్ను మెచ్చుకున్నారు. ఒక్క కట్‌ లేకుండా యు సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఐశ్వర్య, నిరంజన్‌ పాత్రల గురించి ఆడియెన్స్‌ చెబుతారు. ఇందులోని ఫాదర్‌, డాటర్‌ రిలేషన్‌ను అద్భుతంగా చూపించాం. మంచి ఎమోషన్‌ను చూపించబోతున్నాను. ఈ మూవీని అన్ని వర్గాల ఆడియెన్స్‌ కోసం తీశాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -