Sunday, March 29, 2026
E-PAPER
Homeమానవిపాదాల రక్షణకు….

పాదాల రక్షణకు….

- Advertisement -

ఎండల ఉధృతి పెరుగుతోంది. ఉక్కపోతా ఎక్కువైంది. ఈ కాలంలో చెప్పులపై మరింత జాగ్రత్త పడుతుంటారు. అయితే వేసవిలో ఫుట్‌వేర్‌తో పాటు ఫుట్‌కేర్‌ విషయంలో కూడా జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే ఈ కాలంలో వేడి, చెమట, ఎండ వంటి అనేక కారణాలతో పాదాలు పొడిగా, పగిలిపోయి, సన్‌బర్న్‌కు గురయ్యే ప్రమాదముంది. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి, పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.

స్క్రబ్బింగ్‌ వల్ల చనిపోయిన చర్మ కణాలు తొలగి, రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇందుకు ఇంట్లో తయారుచేసిన ఫుట్‌ స్క్రబ్‌ను ఉపయోగించవచ్చు. చక్కెర లేదా కాఫీ పొడిని ఉపయోగించి స్క్రబ్‌ తయారు చేయవచ్చు. మడమలు, పాదాలకు రెండు వైపులా చర్మం త్వరగా పొడిగా, నలుపు రంగులోకి మారుతుంది. అందుకే ఆ ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. మాయిశ్చరైజర్స్‌తో స్క్రబ్‌ చేసిన తర్వాత, చర్మాన్ని తేమగా, మదువుగా ఉంచడానికి మాయిశ్చరైజర్‌ లేదా ఫుట్‌ క్రీమ్‌ అప్లై చేసుకోవాలి. తేమను లాక్‌ చేయడానికి, పొడి చర్మాన్ని వదిలించుకోవడానికి కొబ్బరి నూనె లేదా గ్లిజరిన్‌ వంటి పదార్థాలు రాసుకోవచ్చు.

బయటకు వెళ్లే ముందు హానికరమైన UV కిరణాల నుంచి రక్షించడానికి కాళ్లకు, పాదాలకు సన్‌స్క్రీన్‌ అప్లై చేయవచ్చు. వేసవి కాలంలో చల్లటి నీటిలో కొన్ని చుక్కల పుదీనా లేదా టీ ఆయిల్‌ను కలిపి కాళ్లను కాసేపు అందులో నానబెట్టడం మంచిది. ఇలా చేస్తే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించవచ్చు. ఎప్సమ్‌ సాల్ట్‌ఎప్సమ్‌ సాల్ట్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి 15-20 నిమిషాల పాటు కాళ్లను నానబెట్టాలి. ఇలా చేస్తే అలసిపోయిన కండరాలు రిలాక్స్‌ అవుతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ కూడా తగ్గుతుంది. పొడి చర్మం మదువుగా తయారవుతుంది. శరీరాన్ని, చర్మాన్ని లోపల నుంచి హైడ్రేట్‌గా ఉంచడానికి రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. సరైన హైడ్రేషన్‌ పొడి చర్మానికి చెక్‌ పెడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -