మెరిసే చర్మం కావాలనుకుంటే మీరు కూడా కొన్ని అలవాట్లు మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే వీటిని అమలు చేయడం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం
ఉదయం నిద్రలేవగానే చల్లటి నీటితో ముఖం కడుక్కుంటారు. ఇది కేవలం శుభ్రపరిచే ప్రక్రియ మాత్రమే కాదు.. చర్మానికి తాజాదనాన్ని, మెరుపును కూడా ఇస్తుంది. చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇందుకోసం ఉదయం నిద్రలేచిన వెంటనే ముఖాన్ని చల్లటి నీటితో సున్నితంగా కడగాలి. ముఖాన్ని తుడిచే బదులుగా.. దానిని సహజంగానే ఆరనివ్వండి. రోజూ ఇలా చేయడం వల్ల గ్లాసీ స్కిన్ మీ సొంతమవుతుంది.
ముఖానికి మసాజ్
మెరిసే చర్మం కోసం ప్రతి రోజూ ఫేషియల్ మసాజ్ చేయాలి. చర్మాన్ని బిగుతుగా ఉంచుకోవడానికి, సహజమైన మెరుపు కోసం రోజూ ఉదయం ఫేషియల్ మసాజ్ బెస్ట్ ఆప్షన్. తేలికపాటి ఫేషియల్ ఆయిల్ లేదా మాయిశ్చరైజర్ రాసి మీ వేళ్లతో ముఖాన్ని వత్తాకార కదలికలో మసాజ్ చేయండి. ఇలా 5-10 నిమిషాలు చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది.
సన్‌స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోవద్దు
సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. మంచి సన్‌స్క్రీన్‌ను మీ బ్యూటీ కేర్‌లో భాగం చేసుకోండి. ఇది చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షిస్తుంది. ఇది మచ్చలు లేకుండా ఉంచుతుంది. ముఖం, మెడ, చేతులకు సన్ స్క్రీన్ రాయండి. మీరు బయటకు వెళ్లాలనుకుంటే ప్రతి 2-3 గంటలకు ఒకసారి దీన్ని మళ్లీ అప్లై చేసుకోండి.
లోపలి నుంచి మెరుపు కోసం
బయట నుంచి మాత్రమే కాదు చర్మాన్ని లోపల నుంచి కూడా రక్షించుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం లోపలి నుంచి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాస్ నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. రోజూ ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగండి. చర్మం హైడ్రేటెడ్‌గా, లోపల నుంచి శుభ్రంగా ఉండటానికి రోజంతా తగిన మోతాదులో నీరు తాగుతూ ఉండండి.
మెరిసే చర్మం కోసం…
- Advertisement -
- Advertisement -