Wednesday, January 14, 2026
E-PAPER
Homeమానవిమానసిక ఆరోగ్యానికి…

మానసిక ఆరోగ్యానికి…

- Advertisement -

సమతుల్య ఆహారం తీసుకుంటేనే..ఎవరైనా శక్తివంతంగా ఉంటారు. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారని వైద్యులు చెబుతుంటారు. ఇదిలా ఉంటే.. మీ ఆహారపు అలవాట్లే.. మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. తీసుకునే ఆహారంపై నియంత్రణ లేకపోవడం వల్ల కూడా మీరు పలు అనారోగ్యాలకు గురికావొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి

ఆహారాన్ని హడావిడిగా తినకుండా.. ప్రశాంతంగా తినడం అలవాటు చేసుకోవాలి. ప్రధానంగా తీవ్ర భావోద్వేగాలకు గురైనప్పుడు కొందరు ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇది మంచి అలవాటు కాదని వైద్యులు చెబుతున్నారు.
తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. స్వీట్స్‌ ఎక్కువగా తీసుకుంటే.. అవి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. తీపి పదార్థాలు, పానీయాలు కానీ ఏవైనాసరే..మెదడుపై అధిక ఒత్తిడిని కలుగజేస్తాయని, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు చెబుతున్నారు.
వెజ్‌, నాన్‌వెజ్‌, స్వీట్స్‌.. ఇలా ఏవైనాసరే.. ఏ ఆహారాన్ని అయినా.. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మితంగా, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల..మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని, మానసిక, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -