Sunday, March 22, 2026
E-PAPER
Homeమానవిదోమల నివారణకు…

దోమల నివారణకు…

- Advertisement -

దోమలు అనేవి ప్రతి ఇంట్లోనూ సాధారణ సమస్య. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరమైన జబ్బులను వ్యాప్తి చేస్తాయి. అందుకే వీటిని నివారించడం చాలా ముఖ్యం. ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా సహజసిద్ధమైన పద్ధతులతో దొమలను నశింపజేయవచ్చు. వంటింట్లో అందుబాటులో ఉండే కొన్ని చిట్కాలతో దోమల సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.

లవంగాలు
లవంగాలు – నిమ్మరసాన్ని మిక్స్‌ చేసి దోమలు ఉండే ప్రదేశాల్లో ఉంచండి. దీని వాసనను దోమలు తట్టుకోలేవు. లవంగపు గింజలను నీటిలో ఉడికించి ఆ నీటిని చల్లుకోవచ్చు. లవంగపు నూనెను దీపం వెలిగించేటప్పుడు కొన్ని చుక్కలు వేయవచ్చు. ఇలా చేయడం వల్ల దోమల బెడద తగ్గుతుంది.

నిమ్మరసం, నిమ్మకాయ తొక్కల ఉపయోగం
దోమలను ఆకర్షించకుండా చేయడానికి నిమ్మరసాన్ని నీటిలో కలిపి ఇళ్ల మూలల్లో చల్లి చూడండి. నిమ్మకాయ తొక్కలను దొమలు ఎక్కువగా చేరే ప్రదేశాల్లో ఉంచితే అవి దూరంగా ఉంటాయి.

వెల్లుల్లి నీరు
వెల్లుల్లి రెబ్బలను కోసి గదిలో ఉంచడం ద్వారా దోమలను దూరం చేయవచ్చు. వెల్లుల్లిని నీటిలో మరిగించి ఆ నీటిని గదుల్లో స్ప్రే చేయండి. వెల్లుల్లి వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. కర్పూరాన్ని చిన్న పాత్రలో వెలిగించి గదిలో ఉంచితే దోమలు ఆ దరి చేరవు.

తులసి
తులసి ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని స్ప్రే చేయవచ్చు. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ద్వారా దోమలను నివారించవచ్చు. తులసి మొక్కను ఇంటి ముందు పెంచడం వల్ల కూడా దోమలు ఇంట్లోకి రావు. తులసి ఆకుల రసం దోమలను ఆకర్షించకుండా చేస్తుంది.

లెమన్‌ గ్రాస్‌
లెమన్‌ గ్రాస్‌ నూనెను దీపం వెలిగించేటప్పుడు కొన్ని చుక్కలు వేయవచ్చు. లెమన్‌ గ్రాస్‌ ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని స్ప్రే చేయవచ్చు. వేప నూనెను నీటిలో కలిపి గదుల్లో స్ప్రే చేస్తే దోమలు దూరంగా ఉంటాయి.

నీలగిరి నూనె
నీలగిరి నూనెను కొబ్బరి నూనెతో కలిపి చర్మంపై రాసుకుంటే దోమలు దూరంగా ఉంటాయి. ఈ నూనెను నీటిలో కలిపి స్ప్రే చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి. పుదీనా ఆకులను మరిగించి, ఆ నీటిని గదుల్లో స్ప్రే చేస్తే దోమలు ఇంట్లో ఉండవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -