Thursday, November 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాజకీయ లబ్ది కోసమే

రాజకీయ లబ్ది కోసమే

- Advertisement -

సినీ కార్మికులను ప్రభావితం
చేసే ప్రకటనలు ఆక్షేపణీయం
ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి
ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నికలో ఒక వర్గం నుంచి రాజకీయ లబ్ది పొందేందుకే రాష్ట్ర సర్కారు అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టిందనీ, సినీ కార్మికులను ప్రభావితం చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనలు చేశారని బీజేపీ నేతల మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి పదవి ఇవ్వడాన్ని అడ్డుకోవాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లో బీజేపీ బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. అనంతరం శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ మంత్రివర్గ విస్తరణ చేయవద్దని ఎక్కడ కూడా లేదనీ, అయితే, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి జూబ్లీహిల్స్‌ నుంచి పోటీచేసిన అజహరుద్దీన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడాన్నే ఆక్షేపిస్తున్నామని తెలిపారు. మంత్రి పదవి ఆశ చూపి ఆ వర్గాన్ని మోసం చేయాలని కాంగ్రెస్‌ భావిస్తున్నదని విమర్శించారు. ఎన్నికల ఉల్లంఘన జరిగితే అధికారుల నిర్లక్ష్యనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ..కాంగ్రెస్‌ సర్కారు రోజురోజుకీ దిగజారి వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మంత్రి వర్గ విస్తరణ ను ఎన్నికల సంఘం అడ్డుకోవాలని ఈసీని కోరామన్నారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని నొక్కి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -