నవతెలంగాణ – కంఠేశ్వర్ : లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాదు నగరంలోని వివేకానంద నగర్ కాలనీలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు కాలనీలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని లయన్స్ క్లబ్ జిల్లా అదనపు కోశాధికారి పి.లక్ష్మినారాయణ సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అద్యక్ష కార్యదర్శులు ఎ.లింబాద్రి, పి.రాఘవేందర్, కోశాధికారి ఎ.రాజేందర్, పూర్వాద్యక్షులు జి.రామకృష్ణ రెడ్డి, గంగాదాస్, సభ్యులు వెంకటరమణ, బాబుకృష్ణ,రాజశేఖర్, వివేకానంద నగర్ కాలనీ సంక్షేమ సంఘం అద్యక్ష కార్యదర్శులు నర్సింహారెడ్డి, నర్సారెడ్డి, కోశాధికారి తుకారాం, సభ్యులు విజయలక్ష్మి, శారద, రవి, కృష్ణ, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమం..
- Advertisement -
- Advertisement -