రోడ్డున పడ్డ వలస ఆదివాసీలు
నవతెలంగాణ-మంగపేట
ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి, మంగపేట గ్రామాల మధ్య అడవిలో నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్న వలస ఆదివాసీలపై గురువారం ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. కొన్నేండ్లుగా దాదాపు 10 కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్న వలస ఆదివాసీ నివాసాలపై దాడులు చేసి వారి గుడిసెలను కూల్చివేసి నిరాశ్రయులను చేశారు. అడవిని నమ్ముకొని జీవించే ఆదివాసులపై దాడులు చేయడం ఎంతవరకు న్యాయమని శాంతినగర్ వాసులు ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కాగా వలస ఆదివాసీ గిరిజనులపై దాడులు చేసి వారి నివాసాలను కూల్చివేయడం సమంజసం కాదని, ఇది వారి హక్కులను కాలరాయడమేనని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎన్‌ఎస్ ప్రసాద్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పూణెం నాగేష్, చిరంజీవి ఫారెస్ట్ అధికారుల తీరును ఖండించారు.
శాంతినగర్‌లో ఫారెస్ట్ అధికారుల దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES