Thursday, October 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమాజీ సీఎం కేసీఆర్‌ను విచారించాలి

మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించాలి

- Advertisement -

వక్ఫ్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ వక్ఫ్‌ బోర్డులో కార్యాలయ దుర్వినియోగం, తప్పుడు నిర్వహణ, నేరపూరిత వ్యవహారం, అవినీతి తదితర విషయాలపై మాజీ సీఎం కేసీఆర్‌, ముతావలీ వక్ఫ్‌ మెంబర్‌ నిజాముద్దీన్‌ అక్బర్‌పై సీబీఐ విచారణ జరిపించాలని ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ సిఫారసు చేసింది. బుధవారం హైదరాబాద్‌ లో మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఆ కమిటీ సభ్యులు, అడ్వకేట్‌ డాక్టర్‌ లుబ్నా సార్వత్‌, ఏపీ మైనార్టీస్‌ కమిషన్‌ మాజీ సభ్యులు అడ్వకేట్‌ సయ్యద్‌ తారీఖ్‌, ఖాద్రీ తదితరులు కలిసి నివేదికను సమర్పించారు. నిజ నిర్దారణలో వెల్లడైన విషయాలతో పాటు వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై ఆ నివేదికలో సిఫారసులు చేసినట్టు వారు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -