Saturday, March 7, 2026
E-PAPER
Homeఖమ్మంమండలంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పర్యటన

మండలంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పర్యటన

- Advertisement -

– బాధిత కుటుంబాలకు పరామర్శ 
– ఆర్థిక సహాయం అందజేత
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు శనివారం పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.  అలాగే పార్టీ నాయకులతో సమావేశమై స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

మండలంలోని గుమ్మడివల్లి గ్రామంలో నాజర్ ఆహ్వానం మేరకు ఆయన వారి నివాసానికి వెళ్లి గ్రామంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయంగా మాట్లాడారు.గ్రామ రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకుని పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.

అనంతరం కోయరంగాపురం లో ఇటీవల ప్రమాదవశాత్తు కారం మల్లయ్య నివాసం అగ్నికి ఆహుతి అయిన ఘటనపై సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం అందజేసి, అధికారులతో మాట్లాడి ఇల్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

తదుపరి నారాయణపురం లో కాటూరి నాగయ్య మేనకోడలు (బోడపాటి వెంకటమ్మ కుమార్తె) అనారోగ్యంతో మృతిచెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు.అలాగే బీఆర్ఎస్ నాయకుడు జక్కుల రాంబాబు మాతృమూర్తి జక్కుల నాగమణి మరణించడంతో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో కోయరంగాపురం సర్పంచ్ సోడెం చిన్ని గంగమ్మ, ఉప సర్పంచ్ మడివి లక్ష్మణ్, వార్డ్ మెంబర్లు సెట్టిపల్లి కృష్ణారెడ్డి, ముత్తమ్మ, నాయకులు చందా లక్ష్మీనర్సయ్య, మిండ దుర్గారావు, మాజీ సర్పంచ్ చిచ్చోడు సీతారాములు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కుర్సం వెంకటేశ్వరరావు, పుట్ట సత్యం, సాయిల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -