Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామానందాచార్యా గురూజీ పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

రామానందాచార్యా గురూజీ పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని దోస్తుపల్లి గ్రామం నుండి మహారాష్ట్రలోని న్యానిజ్ ధామ్ వరకు పాదయాత్రగా శనివారం జగద్గురు రామానంద చార్య నరేంద్ర స్వామీజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే పాదయాత్రలో పాల్గొని పల్లకి సేవలో పాల్గొనడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నెల రోజుల పాటు పాదయాత్ర ఉంటుంది అని తెలిపారు. భక్తి శ్రద్ద లతో పాదయాత్ర కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం స్వామి ఆదేశాల మేరకు మొక్కలు నాటడం జరిగింది. ఈ పాదయాత్ర దిండికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో వేలాదిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర స్వామీజీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చెడు మార్గం విడి మంచి మార్గంలో నడుచుకోవాలని అప్పుడే సకుటుంబ సమేతంగా సంతోషంగా ఉండగలుగుతారని అశేషంగా హాజరైన భక్తులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -