Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభాకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

ప్రభాకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్

భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దొంకేన ప్రభాకర్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందగా, శనివారం భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ప్రభాకర్ గౌడ్ మృతదేహంపై పుష్పగుచ్ఛం వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కోసం విశేషంగా కృషి చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన దొంకేన ప్రభాకర్ గౌడ్ మృతి చెందడం పార్టీకి తీవ్రలోటని, అతనికి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

నివాళులు అర్పించిన వారిలో భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి,జిల్లా గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ జడల అమరందర్ గౌడ్, మాజీ జడ్పీటిసి సుబ్బురు బీరు మల్లయ్య, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, జక్క రాఘవేందర్ రెడ్డి, ఉడుత ఆంజనేయులు యాదవ్, మాజీ ఎంపిపిలు అతికం లక్ష్మీనారాయణ కేషవపట్నం రమేష్ ,జడల యాశీల్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -