- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ తెలుసుకొని సోమవారం పరమార్షించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇదే గ్రామంలో అడుప రామక్క,ఎడ్ల లస్మయ్య లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి, మాజీ సర్పంచ్ శనిగరం రమేష్, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -

                                    

