నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల పంచాయతీ రాజ్ ఉపకర్య నిర్వాహక ఇంజనీర్ గా పనిచేసిన అమ్మాపురం రవీంద్ర బాబు ఉద్యోగ విరమణ సన్మాన సభలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంతు షిండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవీంద్రబాబుఅందరినీ ఆప్యాయంగా పలకరించేవారని అన్నారు.
విధులలో భాగంగా రవీంద్రబాబు జుక్కల్ నియోజకవర్గానికి కొత్తగా వచిన్నపుడు, నేను అయన ఉస్మానియాలో ఇద్దరం ఒకేసారి చదుకున్నాము అని తెలవడంతో చాలా సంతోషంగా అనిపించింది. మా జుక్కల్ నియోజకవర్గానికి అధికారులు రావాలంటే బయపడేవారు. కానీ వచ్చినాక వెళ్లేటప్పుడు అంతే బాధపడుతూ వెళతారు. మన జుక్కల్ నియోజకవర్గ ప్రాంత ప్రజలు అధికారులతో, అనధికారులతో అంతగా ఆయన మమేకమై పోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.