నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన కందికొండ మల్లేష్ ఇటీవల కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ గ్రామానికి వెళ్ళి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మల్లేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మల్లేష్ మృతి కుటుంబానికి తీరని లోటని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జక్కు రాకేష్, జోడు శ్రీనివాస్, చిట్యాల సమ్మయ్య, చీమల వంశీ, బొడ్డు రాజబాపు, రామిల్ల రాజు, కందికొండ రాజు, మునిమందా మధుకర్, కందికొండ తిరుపతి, కందికొండ సమ్మయ్య, తిప్పిరి రమేష్, తిప్పిరి శ్రీనివాస్, చిగురు రాజు, దాకని లక్ష్మణ్, క్యాపరబోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.



