నవతెలంగాణ – కుభీర్
మండలంలోని న్యూ సౌంలీ గ్రామానికి చెందిన గాడే రాందాస్ ఇటీవల వివిధ కారణాల వల్ల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను శనివారం ముధోల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నారాయణ్ రావు పటేల్ పరామర్శించారు. ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులకు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, పూర్తి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్యామరావు పటేల్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే ,మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్, బెంబర్ సర్పంచ్ లక్ష్మణ్, న్యూ సౌంలీ సర్పంచ్ లక్ష్మణ్ ఉప సర్పంచ్ సాయికుమార్, కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకుడు పురం శెట్టి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



