- Advertisement -
- – పేదవారికి ఎంత చేసిన తక్కువే..
– ఎల్లప్పుడూ గ్రామానికి రుణపడి ఉంటా..
– ఇందిరమ్మ లబ్ధిదారులకు 5 వేల ఆర్థిక సహాయం అందజేత.. - నవతెలంగాణ – డిచ్ పల్లి
- తన సంపాదించిన వాటిలో కొంతమేర లబ్ధిదారులకు అందజేయాలని సదుద్దేశంతో గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు తన వంతు సహాయంగా 5000 రూపాయల చొప్పున 32 మందికి ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వంను చాటుకున్నారు దర్పల్లి మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్. సోమవారం ఇందల్ వాయి మండలంలోని గౌరరం గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులతో ఎంపీడీవో అనంతరావు, హౌసింగ్ ఏఈ అనూష అర్ల సమావేశం ఏర్పాటు చేసి ఇందిరమ్మ గృహ నిర్మాణానికి మార్గదర్శకాలను వివరించారు అనంతరం ఎంపికైన లబ్ధిదారులకు ఆర్డర్ కాపీలను అందజేశారు గ్రామంలో మొత్తం 38 మందికి ఇల్లు మంజూరయ్యాయని దానిలో 32 మంది కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు మిగతావారు ఇలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు అవుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు. పూర్తిగా నిరుపేదలై ఉండి డబ్బు లేని వారికి మహిళా సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ ద్వారా వారికి 50 వేల నుండి లక్ష రూపాయల వరకు రుణాలను అందజేసే విధంగా చర్యలు చేపడతానని ఒకసారి ఇల్లు పనులు మొదలైతే దాన్ని పూర్తి చేసే విధంగా చూడాలన్నారు.
- అనంతరం మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి ముదిరాజ్ మాట్లాడుతూ పేదింటి వారి కళ నెరవేర్చలన్న సంకల్పమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం లాబ్దిదారులకు ఒక వరంల మారిందన్నారు. గ్రామంలో ఇల్లు లేని వారు మిగలకుండా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో మొత్తం 58 ఇల్లు మంజూరయ్యాయన్నారు. తను ఈసారి తన పంట పొలాల్లో వేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు విక్రయించిన తర్వాత 23 లక్షల రూపాయలు వచ్చాయని దానిలో మూడు లక్షల రూపాయలు నిరుపేదలు ,పేదలకు పంచడానికి నిర్ణయించుకున్నానని ఆయన అన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరికి తన వంతుగా 5000 రూపాయలను అందజేస్తున్నట్లు, దానిలో భాగంగానే ముగ్గు వేసిన వారందరికీ డబ్బులను అందజేస్తానని అభయమిచ్చారు. ఇదే కాకుండా ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశానికి సైతం తన వంతు సహకారం అందజేస్తానని వారందరికీ హామీ ఇచ్చారు అడగకముందే పేదలకు 5000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసిన ఇమ్మడి గోపి కృషి కి పలువురు అభినందించి ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో పుట్టి పెరిగి ఉన్నత పదవులు తనకు దక్కాయని వారి సంక్షేమం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తూనే ఉంటానని ఇమ్మడి గోపి ముదిరాజ్ పేర్కొన్నారు.ఇల్లు పాత్రలు రాలేదన్న ఆవేదన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే సహకారంతో అందజేస్తామని తెలిపారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి గ్రామం తరపున లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సుశీల, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కరోబార్ రవి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -