నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ హెరిటేజ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్‌రావుతో లక్నో సెంటర్ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రో. విక్టర్ బాబు ..హైదరాబాద్‌లోని డిపార్ట్మెంట్ అఫ్ హెరిటేజ్ ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు దక్షిణ భారత చరిత్ర ప్రాచీన కాలం నుండి ఆధునిక దశ వరకు జరిగిన పరిణామాలపై వారు అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా చారిత్రక పరిశోధనలో కొత్త దృక్కోణాలు, వారసత్వ పరిరక్షణలో ప్రభుత్వ పాత్ర, యువ చరిత్రకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు వంటి అంశాలపై సానుకూలంగా చర్చించారు. భవిష్యత్తులో దక్షిణ భారత చరిత్ర అధ్యయనాన్ని మరింత విస్తరించేందుకు కలిసి పనిచేయాలని ఇద్దరు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. స్నేహపూర్వక భేటీ చరిత్ర పరిశోధన రంగానికి ఉత్తేజాన్ని అందించనుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రొ.అర్జున్‌రావుతో మాజీ రిజిస్ట్రార్ ప్రొ.విక్టర్ బాబు భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



