- Advertisement -
నవతెలంగాణ -చిన్నకోడూరు
మండల కేంద్రమైన చిన్నకోడూరులో నూతనంగా సర్పంచ్ పదవికి ఎన్నికైన ఇట్టబోయిన శ్రీనివాసును మాజీ సర్పంచ్ కామెడీ ఉమేష్ చంద్ర ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో మీరు గ్రామానికి సేవ చేసినట్టుగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి తన వంతు సహకారాన్ని అందజేస్తామన్నారు. నాపై నమ్మకంతో నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించిన అన్నా తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉపసర్పంచ్ లు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు ఉన్నారు.
- Advertisement -



