- Advertisement -
-రావుల నర్సయ్యకు వాహనదారుల అభినందనలు
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని బేగంపేట ప్రధాన రోడ్డుపై ఏర్పడిన గుంతలకు మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య దాతల సహాకారంతో మట్టీతో పూడ్చి బుధవారం మరమ్మతులు చేశారు. గుంతలతో వాహనదాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాల బారిన పడిన సందర్భాలున్నాయి. గమనించిన మాజీ సర్పంచ్ నర్సయ్య దాతలు బండి వేణు,చేరుకూరి నర్సయ్య, సంగ రమేశ్ సహాయంతో మట్టితో గుంతలు పూడ్చారు. మాజీ సర్పంచుకు వాహనదారులు అభినందనలు తెలిపారు.
- Advertisement -