Monday, January 26, 2026
E-PAPER
Homeజిల్లాలుబీఆర్ఎస్ పార్టీకి మాజీ జెడ్పీటీసీ దంపతుల రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి మాజీ జెడ్పీటీసీ దంపతుల రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన తాజా మాజీ జెడ్పిటిసి పెరుమండ్ల రాధా రాజా గౌడ్ దంపతులు బిఆర్ఎస్ పార్టీకి, క్రియాశీల సభ్యత్వనికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి లేఖ రాశారు. 12 సంవత్సరాలు మీతో నడిచిన ప్రయాణంలో ఎప్పుడైనా మనసు నొప్పించి ఉంటే క్షమించాలని లేఖలో పేర్కొన్నారు. పది సంవత్సరాలు కోనాపూర్ గ్రామ ప్రజలు, మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు రాజకీయ జీవితాన్ని అందించారని, అందరికీ జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.

ఒక పార్టీలో వుండి, అ పార్టీకి కట్టుబడి పనిచేయడం వల్ల, కొందరికి ఇబ్బందులు కలిగుంటే క్షమించాలని కోరారు. ఎన్నికల్లో పార్టీకి పని చేయడం వలన గ్రామంలో మంచిగా కలిసిమెలిసి ఉన్న కుటుంబాలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకే రాజకీయంగా ఎవర్ని ఇబ్బంది పెట్టకూడదనీ, రాజీనామా నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.ఇక నుంచి మా కుటుంబానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, భవిష్యత్తులో కూడ ఉండదన్నారు. మండల బిడ్డగా మండలంలో ఏ అవసరం వచ్చినా ప్రజలకు తమ వంతుగా సహాయంగా ఉంటామని తెలిపారు.మాకు పది సంవత్సరాలు రాజకీయ బిక్ష పెట్టినా కోనాపూర్ ప్రజలకు, కమ్మర్ పల్లి మండల ప్రజలకు పేరు పేరునా పాదాభివందనాలంటూ మాజీ జడ్పీటీసీ పెరుమాండ్ల రాధ రాజగౌడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -