నవతెలంగాణ – ముధోల్ : ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన నలుగురు నిందితులను హత్య యత్నం కేసులో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ముధోల్ సిఐ మల్లేష్ తెలిపారు. ముధోల్ సర్కిల్ పోలిస్ స్టేషన్ కార్యాలయంలో ఈ కేసు సంబంధించిన వివరాలను సీఐ బుధవారం విలేకరుల సమావేశం లో వెల్లడించారు. సిఐ కధనం ప్రకారం…. మండలంలోని ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన సాయన్న కు వరుసకు మామయ్య అయిన కాశీరాం కు సంబంధించిన 3-09ఎకరాల వ్వవసాయ చేనును గతం నుండి సాగుచేసేవాడు. అయితే కాశిరాం అనే వ్యక్తి సుమారు ఆరు నెలల క్రితం మృతి చెందాడు.
ఈ సంవత్సరం ఖరిప్ లో చేనులో మృతుడు కాశిరాం కు వరుసకు కొడుకు అయిన నారాయణ మొదటి సారి కంది విత్తాడు. ఈ విషయం తెలుసుకున్న గతం నుండి సాగు చేస్తున్నా సాయన్న తన తో కుటుంబ సభ్యులులైన భార్య ముత్తవ్వ, కూమార్తెలు సంధ్యా రాణి, స్వప్న లతో కలిసి మళ్ళీ అదే చేను కు వేళ్ళి దున్నుతుండగా ఈ విషయం తెలుసుకున్న ముందు కంది పంట విత్తిన నారాయణ, నర్సయ్య, రుక్మబాయి,అనిత లు చేనులకు వేళ్ళి అడ్డుకున్నారు. దీంతో సాయన్నతో పాటుఅతని కుటుంబ సభ్యుల పై కర్రలతో,గొడ్డలితో నిందితులు దాడి చేశారు. గాయాల నొప్పి బరించలేక బాధితులు అరవడంతో దాడి చేసిననలుగురు నిందితులు నారాయణ, నర్సయ్య, రుక్మవ్వ, అనిత లు అక్కడి నుండి పరారయ్యారు.
దీంతోబాధితులు 100 కాల్ కు డయల్ చేయడంతో హూటహుటిన ముధోల్ ఎస్సై బిట్ల పెర్సెస్ ,తన సిబ్బందితో సంఘటన స్థలానికి వేళ్ళి తీవ్ర గాయాలపాలైన బాధితులను చికిత్స నిమిత్తం భైంసా ఏరియాఆసుపత్రికి తరలించారు. బాధితుడు కుటుంబ సభ్యురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముధోల్ పోలీసులు కేసు నమోదుచేశారు. నాల్గురు నిందితులను పట్టుకోని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్సై బిట్ల పెర్సెస్, పోలీస్ సిబ్బంది , పాల్గొన్నారు.
హత్యాయత్నం కేసులో నలుగురు అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES