Wednesday, February 11, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి..

 నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి..

- Advertisement -

– దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి..
 నవతెలంగాణ – జన్నారం
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, గురువారం నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జన్నారం మండల సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శి కొండగుర్ల లింగన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక, వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసంహరించు కునేలా కార్మిక వర్గం ప్రతిఘటనకు పూనుకోవాలని, లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని, కార్మికులకు కర్షకులకు విజ్ఞప్తి చేశారు. సమ్మెతోనే పాలకవర్గానికి సమాధానం చెప్పాలని 2026 ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో రాష్ట్రంలో అన్ని స్థాయిలోని అన్ని కార్మిక సంఘాలు వాటి అనుబంధ యూనియన్లు యావత్ కార్మికులు భాగస్వామ్యం కావాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

          కార్మిక వర్గం ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరినారు.

           ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు కే బుచ్చయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అంబటి లక్ష్మణ్, మండల నాయకులు దాసండ్ల రాజన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ నాయకులు గంధం రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -