Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి

- Advertisement -

అతివేగంగా చెట్టును ఢీకొన్న కారు
బర్త్‌ డే పార్టీకి వెళ్లి వస్తుండగా ప్రమాదం
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మిర్జాగూడ వద్ద ఘటన


నవతెలంగాణ-శంకర్‌పల్లి
అతివేగంగా వస్తున్న కారు.. అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం దొంతానపల్లిలోని ఇక్ఫారు (ఐబీఎస్‌) కళాశాలలో సూర్యతేజ (20), సుమిత్‌ (20), నిఖిల్‌(18), సాయి, నక్షత్ర బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నారు. రోహిత్‌ (20) ఎంజీఐటీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. మొత్తం ఆరుగురు బుధవారం రాత్రి కోకాపేటలో జరిగిన ఓ బర్త్‌ డే వేడుకకు వచ్చారు. పార్టీ అనంతరం స్పోర్ట్స్‌ కారులో ఆరుగురు తిరుగు ప్రయాణమయ్యారు. పొద్దుటూరు, మోకిలా గేటు వద్ద సాయిని డ్రాప్‌ చేశారు. అనంతరం సూర్యతేజ, సుమిత్‌, నిఖిల్‌, రోహిత్‌, నక్షత్ర ఐదుగురు హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు.

వీరు మీర్జాగూడ గేట్‌ వద్దకు రాగానే కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. నక్షత్ర తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన నక్షత్రను గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. నాలుగు మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోహిత్‌ వారిని డ్రాప్‌ చేయడానికి వచ్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పార్టీ ఎవరిది? ఆ పార్టీలో వీరితోపాటు ఎవరెవరు పాల్గొన్నారు? ఆరుగురిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -