నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం నాలుగేండ్ల చిన్నారిపై ఇద్దరు మధ్యప్రదేశ్ కు చెందిన యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం .. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అఘహిత్యానికి పాల్పడ్డారు. అయితే ఆ చిన్నారి భయంతో కేకలు వేయడంతో చుట్టుప్రక్కల ఉన్నవాళ్లు తలుపులు పగలగొట్టి చిన్నారిని కాపాడారు. అనంతరం బాలికను ఆస్పత్రికి తరలించి, ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన యువకులను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనాకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు నిందితులు మద్యం లేదా గంజాయి సేవించి చిన్నారిపై దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో బాదిత చిన్నారిని సిడబ్ల్యుసి బృందం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళి పరామర్శించింది. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
నాలుగేండ్ల చిన్నారిపై యువకుల లైంగిక దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    