నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధ విరమణపై పాక్ వేదికగా యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఇరు దేశాల ప్రతినిధులు పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదరక చర్చలు విఫలమైయ్యాయి. దీంతో హర్మూజ్ జలసంధి గుండా చమురు నౌకల రాకపోకలపై సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధి గుండా చమురు నౌకల సురక్షత ప్రయాణానికి ఫ్రాన్స్, బ్రిటన్ కలిసి వివాదాన్ని పరిష్కారిస్తాయని, బ్రిటన్‌తో కలిసి ఇరాన్‌తో తాము చర్చలు సాగిస్తామని, ఇకపై ఫ్రాన్స్, బ్రిటన్ సుదీర్ఘ వివాదానికి ముగింపు పలికే దిశగా ముందడుకు వేస్తామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను పరిష్కరించడానికి, దీర్ఘకాలిక ప్రాంతీయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి జరుగుతున్న విస్తృత దౌత్య ప్రయత్నాలలో ఈ చర్య ఒక భాగమని, ఈ మిషన్ “పూర్తిగా రక్షణాత్మకంగా” ఉంటుందని, ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన మర్మూజ్ గుండా జరిగే సముద్ర రవాణాను పరిరక్షించడానికి, ఫ్రాన్స్-యూకే రాబోయే రోజుల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాయని మాక్రాన్ రాసుకొచ్చారు.



