Tuesday, October 14, 2025
E-PAPER
Homeజిల్లాలుకమ్మర్ పల్లిలో ఉచిత వైద్య శిబిరం

కమ్మర్ పల్లిలో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం నిజామాబాద్ కు చెందిన మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి హాజరైన ప్రజలకు వైద్యులు డాక్టర్ ఆశిష్, స్టాఫ్ నర్స్ స్వరూప, సిబ్బంది రవి, మోహన్ వైద్య సేవలు అందించారు. శిబిరంలో 70 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి బిపి, షుగర్ టెస్టులు ఈసీజీ పరీక్షలు చేశారు. అనంతరం పలువురు రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో  హెచ్ డి ఎఫ్ సి ఇర్గో మేనేజర్ రాజ గంభీర్, అసిస్టెంట్ మేనేజర్ సదాశివ్, సీనియర్ అడ్వైజర్స్ కొమ్ముల శ్రీనివాస్, పెంబర్తి నరేష్, పంచాయతీ కార్యదర్శి గంగ జమున, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ  రామస్వామి, సభ్యులు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -