నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో రేపు మంగళవారం కరీంనగర్ పట్టణానికి చెందిన మెడికవర్ ఆసుపత్రిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తాడిచెర్ల,కాపురం గ్రామాల భూ నిర్వాసితుల హక్కుల పోరాట కమిటీ అద్యకుడు కేశారపు రవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఏడు సంవత్సరాలుగా బొగ్గు వెలికితీత కోసం చేస్తున్న బ్లాస్టింగ్ వలన కాలుష్యమైన గాలిని పిలుస్తూ ప్రజలు జీవిస్తున్నారాని,ఇప్పుడు అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.కావున గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలకోరారు.ఈ వైద్య శిబిరంలో వైద్య నిపుణులచే పరీక్షలు,ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
రేపు తాడిచెర్లలో ఉచిత వైద్య శిబిరం..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES