Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ- బాల్కొండ 
మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఆక్యు ప్రెషర్ చికిత్స శిబిరం నిర్వహించారు. రాజస్థాన్ కు చెందిన వైద్య సిబ్బంది పంకజ్ రాజ్ పుత్, ధర్మేందర్, సునీల్ కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించారు. కీళ్ల నొప్పులు, ఊబకాయం, పక్షవాతము, మానసిక వ్యాధులు, తలనొప్పి, నిద్రలేమి, మధుమేహం, రక్తపోటు, మెడ నొప్పి తదితర వాటికి చికిత్స నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకు లింగం, జోనల్ చైర్మన్లు జ్ఞాన సాగర్ రెడ్డి, పిండం జీవన్, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -