Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనంతారంలో ఉచిత మెగా ఐ, డెంటల్ క్యాంపు...

అనంతారంలో ఉచిత మెగా ఐ, డెంటల్ క్యాంపు…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్  అనంతారంలో రోటరీ క్లబ్,  మ్యాక్సీవిజన్  సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి హైదరాబాద్ , వజ్ర డెంటల్ క్లినిక్ భువనగిరి సంయుక్త ఆధ్వర్యంలో  ఉచిత మెగా ఐ & డెంటల్ క్యాంపు ను డా. సోమవరపు రాంప్రసాద్ గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ  కొరకు రోటరీ క్లబ్ భువనగిరి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా 300 మంది పైగా విద్యార్థులకు  పరీక్షలు, 100 విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  పలుగుల ఆగేశ్వర్ రావు అధ్యక్షులు, గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి  డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ కాకతీయ రీజియన్, ప్రిన్సిపాల్ జెల్ల స్వప్న, తవిటి  వెంకటనారాయణ కార్యదర్శి, మాజి అధ్యక్షులు శెట్టి బాలయ్య యాదవ్, బాలేశ్వర్ రావు, బండారు శ్రీనివాసరావు, కరిపి నర్సింగరావు, ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు ఇటిక్యాల లావణ్య, కార్యదర్శి వెంకమ్మ  కోశాధికారి ఇటిక్యాల దేవేంద్ర చారి, మాజి కార్యదర్శి కూచిపట్ల సత్యనారాయణ రెడ్డి, సభ్యులు పడాల భాస్కరరావు, గట్టు భాస్కర్ రెడ్డి, కoదారు  రమేష్ బాబు, ఉపాధ్యాయ సిబ్బంది, మాక్స్ విజన్, వజ్ర డెంటల్ క్లినిక్ డాక్టర్స్ పారామెడికల్  సిబ్బంది  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -