- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ, బీటెక్ చదివే విద్యార్థినులకు త్వరలో ఉచితంగా ఎలక్ట్రిక్ (ఈవీ) స్కూటీలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు స్కూటీల ధరలు, పంపిణీ సమయంపై పరిశీలన జరుగుతోంది. సుమారు 1.70 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని, వారికి స్కూటీలు అందించడానికి రూ.1600 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రాబోయే వార్షిక బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయించే అవకాశం ఉంది.
- Advertisement -



