– మొదటి సంవత్సరం విద్యార్ధులకు స్వాగత వేడుకలు…
– ఆడిపాడిన బాలబాలికలు..
– క్రమశిక్షణే విజయానికి పునాది
– ప్రిన్సిపాల్ శేషు బాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తో పాటు క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం మే విజయాలకు పునాది అవుతుంది అని స్థానిక వీకేడీవీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ వెలుగోటి శేషు బాబు అన్నారు. శనివారం కళాశాల లో ప్రథమ సంవత్సరం విద్యార్ధులకు ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు ఘనంగా స్వాగత వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హాజరైన అశ్వారావుపేట బాలుర, బాలికోన్నత పాఠశాల కాంప్లెక్స్ లు ప్రధానోపాధ్యాయులు పి.హరిత,ఎన్.కొండల రావు,సీఆర్పీ ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ ఏరోజు పాఠ్యాంశాలను అదే రోజు చదవడం,అందులోని ముఖ్యాంశాలను తరుచూ రాయడంతో జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని,తద్వారా పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని హితవు పలికారు.
విద్యార్ధులు చే సాంస్క్రుతిక కార్యక్రమాలు నిర్వహించారు.