Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిత్రుడు మృతి.. రూ. లక్ష ఆర్ధిక సాయం

మిత్రుడు మృతి.. రూ. లక్ష ఆర్ధిక సాయం

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల : 1999–2000 ఎస్ఎస్సి బ్యాచ్ ఉప్పునుంతల జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన మిత్రుడు, ఉప్పునుంతల మండలం జప్తి సదగోడు గ్రామానికి చెందిన కోట్ల చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం నిర్వహించిన దశదినకర్మ సందర్భంగా ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

మృతి చెందిన చంద్రయ్యకు ఇంటర్మీడియేట్ చదువుతున్న కూతురు కల్పన ఉండటంతో, ఆమె చదువులకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతుందని క్లాస్మేట్ మిత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే బ్యాచ్‌కు చెందిన మిత్రులు గతంలో కూడా పలు సందర్భాల్లో ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. జప్తి సదగోడు గ్రామానికి చెందిన కుప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికు రూ.1,30,000, ఉప్పునుంతల గ్రామానికి చెందిన పెదిరెడ్డి లింగారెడ్డికు రూ.90,000, నడింపల్లి గ్రామానికి చెందిన రవికు రూ.50,000 చొప్పున దఫా దఫాలుగా సహాయం అందించినట్లు పేర్కొన్నారు. క్లాస్మేట్ మిత్రులకు ఏ ఆపద వచ్చినా తమ వంతు అండగా నిలుస్తామని, మానవత్వంతో కూడిన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాజీ, సైదులు, యాదయ్య, శేఖర్ గౌడ్, లాలయ్య, మధు, జగదీష్ గౌడ్, ప్రవీణ్ సింగ్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -