సృష్టిలో తీయనైనది తల్లిదండ్రుల ప్రేమైతే అంతే మధురమైనది స్నేహం. జీవితంలో ఎవరు ఉన్నా లేకున్నా ఓ మంచి స్నేహంతో జీవితాన్ని లాగేయొచ్చు. స్వచ్ఛమైన స్నేహానికి పేదా ధనిక, కులమూ మతమూ, చిన్నా పెద్దా, వర్గ వైషమ్యాలు, వయసు తారతమ్యాలు ఏవీ అక్కరకు రావు. మనిషికి ఇష్టమైనది, అవసరమైనది స్నేహం. ప్రపంచంలో పశుపక్ష్యాదులతో సహా అందరికీ అవసరమైనది స్నేహమే. జీవితానికి ఒకే ఒక్క స్వచ్ఛమైన స్నేహం లభిస్తే అదృష్టం. అదే ఒకటికి మించిన స్నేహాలు లభించిన ఆ జీవితం ధన్యం.
నోషిన్ అల్ ఖదీర్ మాజీ క్రికెటర్.
వీరిద్దరి మధ్య స్నేహం వయసు 23 ఏళ్ళు. మిథాలీ క్రికెట్ నేర్చుకునే రోజుల నుంచీ నోషిన్‌తో స్నేహం ఉంది. అది రోజు రోజుకూ బలపడుతూ వచ్చింది. మిథాలీ క్రికెట్ నేర్చుకునేప్పటి నుంచి అతడు ఎంతో సహాయకారిగా ఉంటూ వస్తున్నారు. మిథాలీ బయోపిక్ తీస్తున్నప్పుడు ఆమె పాత్ర పోషించిన తాప్సీ పన్నుకు ఎన్నో విషయాలు చెప్పి సహకరించారు.
స్వచ్ఛమైన స్నేహం అందిన వారికి మానసిక సమస్యలు దరిచేరవని అనేక ఆధారాలు రుజువు చేస్తున్నాయి. ఒక మంచి స్నేహం లభిస్తే ఆ వ్యక్తికి మానసిక వైద్యుల అవసరం ఉండదు. మానసిక సమస్యలున్న వారికి ఓ మంచి స్నేహం లభిస్తే ఆ సమస్య నుంచి బయటపడతారు. స్నేహ పరిమళం వికసించిన చోట మానసిక రుగ్మతలు మాయమైపోతాయి. అందుకే కవులు సైతం స్నేహంపై ఎన్నో కవితలు రాసారు. పాటలు రాసారు.
తోడొకరుండిన...
స్వచ్ఛమైన స్నేహం లభించడం అనేది ఆ మనిషి చేసుకున్న అదృష్టంగా చెప్పవచ్చు. మన ప్రమేయం లేకుండానే మన జీవితంలోకి వచ్చేవారు బంధువులైతే… మనకోసం మనం ఎంపిక చేసుకునేది స్నేహితులనట. ఎత్తుపల్లాల జీవితంలో ఎవరు తోడు నిలిచినా నిలవకపోయినా స్వచ్ఛమైన స్నేహం వెన్నంటే ఉంటుంది. అందుకే ప్రాణ స్నేహితులను కలిగి ఉన్నవారు ఎప్పుడూ ఉత్సాహంగా, ఎంతో విశ్వాసంగా కనిపిస్తుంటారు.
ఎంపిక-అప్రమత్తత:
స్నేహం స్వభావరీత్యా స్వచ్ఛమైనదే. ఆ స్నేహం ఏ రూపంలో మన దరికి చేరిందో తెలుసుకోవడం ఎంతో కష్టం. మంచి కోరే స్నేహితులు చెడుగా కనిపించొచ్చు. చెడు చేసే స్నేహితులు ప్రేమగా కనిపించొచ్చు. మంచీ చెడుల మధ్య ఎప్పుడూ అస్పష్టమైన విభజన రేఖ ఉంటూనే ఉంటుంది. మనసుకు సవాలు విసురుతూనే ఉంటుంది. తులసివనం నుంచి గంజాయి మొక్కను పసిగట్టేట్టు మనకై ప్రాణమిచ్చే స్నేహాన్ని కనుక్కోగలగాలి. ఇది ఎవరికైనా పెద్ద టాస్కే. ప్రపంచం అంతా స్నేహమయంగా కనిపించినా మనకోసం తపించే ఓ నిజాయితీగల స్నేహం ఎక్కడో ఓ చోట ఎదురుచూస్తూనే ఉంటుంది. అటువంటి స్నేహం లభించడం జీవితంలో సాధించిన గొప్ప కానుకగా నిలిచే అవకాశం ఉంది. అందుకే స్నేహితుల ఎంపిక విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు పొందినది స్వచ్ఛమైన స్నేహమని మనసుకు తెలిస్తే ఆ స్నేహాన్ని పదిలంగా కాపాడుకోవాలి.
గుర్తించగలమా?
మనకు లభించినది స్వచ్ఛమైన స్నేహమేనా? ఏ వయసులో లభిస్తుంది? అనే విషయాలు ఆలోచించడం వృధా. చాలామంది బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నవారు ఉన్నారు. ఈనాటి జీవన విధానంలో వారంతటి ఆరోగ్యవంతులు మరొకరు ఉండిఉండకపోవచ్చు. ఈ రోజుల్లో కుంగుబాటుకు గురవుతున్న యువత సంఖ్య పెరిగిపోతున్నది. చిన్న కుటుంబాలు, ఒంటరి బతుకులు ఇందుకు కారణం కావొచ్చు. అటువంటి వారికి మంచి స్నేహం లభిస్తే ఆ వెలితి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. అయితే అటువంటి స్నేహాన్ని గుర్తించగలగడమే మన ముందున్న టాస్క్. కొందరు స్వార్థ పూరితమైన కాంక్షలతో దరిచేరవచ్చు. అవసరమైనంత మేరకు ఆర్థికంగా వాడుకోవచ్చు. ఆ తరువాత ముఖం చాటేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే నిజమైన స్నేహం భౌతిక రూపాన్ని చూడదు. మనసుకు ప్రాధాన్యమిస్తుంది. ఇటువంటి స్నేహం కొందరికి జీవితకాలంలో లభించకపోవచ్చు. మరికొందరికి జీవిత ప్రయాణంలో ఏ సమయంలోనైనా ఎదురుపడవచ్చు. ఆ స్నేహాన్ని పదిలంగా కాపాడుకోగలగాలి. అంతే.
స్వచ్ఛత అనే పునాదిపై ఏర్పడిన స్నేహం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ మధ్య కాలంలో స్నేహానికి పరిధి పెరిగింది. ఒకేరకమైన మనస్తత్వాలు కలిగిన వారి మధ్య స్నేహం బలపడుతుంది. అటువంటి స్నేహాలను నేటి తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తున్నారు. వారు కూడా గెట్ టుగెదర్ లాంటివి ఏర్పాటు చేసుకుని తమ తమ స్నేహాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
మంచి స్నేహం అద్దం వంటిది. మన నడవడికను గమనించి తప్పొప్పులను సరిచేసే సహృదయులు స్నేహితులు. ప్రతిఫలం ఆశించని స్నేహం పదిలంగా కలకాలం పరిఢవిల్లనీ.
కార్ల్ మార్క్స్ – ఫెడ్రిక్ ఎంగెల్స్
వీరిద్దరి మధ్య గాఢానుబంధం ఉంది. మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాయడంలో ఎంగెల్స్ పాత్ర ప్రధానమైనది. అంతేకాదు మార్క్స్ చనిపోయిన తరువాత అర్థాంతరంగా మిగిలిన దాస్ క్యాపిటల్ ను ఎడిటింగ్ చేయడం, పుస్తకం బయటకు రావడంలో ఎంగెల్స్ ఎంతో కషి చేశారు. ఇద్దరు మేధావుల మధ్య బలమైన స్నేహం ఉంటే సమాజానికి ఎంత మంచి జరుగుతుందో చెప్పుకోవడానికి వీరిద్దరినీ స్ఫూర్తిగా తీసుకుంటారు.
టాల్స్టారు – చెహోవ్
రష్యన్ రచయిత లియో టాల్స్టారు కు మరో రచయిత చెహౌవ్ మధ్య ఎంతో గొప్ప అనుబంధం ఉండేది. టాల్స్టారు పై ఉన్న ఇష్టంతో, ప్రేమతో అతడి రచనలను ముద్రించడంలో చెహౌవ్ పాత్ర ముఖ్యమైనది.
టబు – అజయ్ దేవగన్
బాలీవుడ్ లో వీరిద్దరి స్నేహం ముచ్చటగొలుపుతుంది. వీరిద్దరూ బాల్య స్నేహితులు. ముందుగా అజరు దేవగన్ టబు సోదరులకు బెస్ట్ ఫ్రెండ్. టబు నటనా రంగంలోకి వచ్చిన తరువాత వీరి స్నేహం మరింత బలపడింది. వీరిద్దరూ జోడీగా ఎన్నో సినిమాలు చేశారు. ఈ స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది.
సాయి పల్లవి – పూజ
వీరిద్దరూ కవలలు. ఇద్దరి మధ్య చక్కటి సౌభ్రాతత్వం ఉంది. అంతే గాఢమైన స్నేహ బంధం ఉంది. సాయి పల్లవికి తన కో ఆర్టిస్ట్ లతోనూ మంచి అనుబంధమే ఉంది. వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. వీరిద్దరూ ప్రేమమ్ సినిమాలో కలిసి నటించారు. తన సోదరి పూజతో ఉన్న అనుబంధాన్ని మటుకు అన్ కండీషనల్ లవ్ అని చెప్తుంది సాయి పల్లవి.
మిథాలీ రాజ్ -నోషిన్ అల్ ఖదీర్
– నస్రీన్ ఖాన్
writernasreen@gmail.com