– విద్యార్థుల డిజిటల్ ఓటు వికసిత భారత్‌కు నాంది
– డిజిటల్ ఓటుతో చరిత్ర సృష్టించిన స్లేట్ ఎక్స్ లెన్స్ సీబీఎస్ పాఠశాల విద్యార్థులు
– జన్నారం స్లేట్ ఎక్స్‌లెన్స్‌లో విజయవంతంగా ‘డిజిటల్ మాక్క్ ఎలక్షన్స్’
– 9వ తరగతి విద్యార్థి రాగుల అవినాష్ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో ఓటింగ్
– ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు అవగాహన
నవతెలంగాణ జన్నారం
నేటి ఆధునిక యుగంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటే సాధ్యం కానిది లేదని జన్నారంలోని స్లేట్ ఎక్స్‌లెన్స్ సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు నిరూపించారు. గురువారం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ‘డిజిటల్ మోక్ ఎలక్షన్స్’ ప్రజాస్వామ్యానికి అద్దం పట్టాయి. ‘వికసిత భారత్’ లక్ష్యంతో, విద్యార్థుల్లో ఓటు హక్కుపై చైతన్యం కల్పించేందుకు నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే, దీనికి వాడిన వ్యవస్థను 9వ తరగతి చదువుతున్న రాగుల అవినాష్ అనే విద్యార్థి స్వయంగా రూపొందించాడు. నిజమైన ఎన్నికలను తలపించేలా ప్రతి విద్యార్థికి ఒక యూనిక్ ఓటర్ ఐడి మరియు పాస్వర్డ్ కేటాయించారు. వీటిని నమోదు చేసిన తర్వాతే డిజిటల్ పద్ధతిలో ఓటు వేసే సౌకర్యం కల్పించారు. దీనివల్ల ఎన్నికల పారదర్శకత, గోప్యత గురించి విద్యార్థులకు ప్రాక్టికల్‌గా అవగాహన కలిగింది. పాఠశాలను Wisdom, Courage, Harmony, Integrity అనే నాలుగు హౌస్‌లుగా విభజించి, హౌస్ కెప్టెన్స్, వైస్ కెప్టెన్స్‌తో పాటు Head Boy, Head Girl, Vice Head Boy, Vice Head Girl, Cultural ministers Sports minister లను విద్యార్థులు తమ ఓటు హక్కుతో ఎన్నుకున్నారు.
నాయకత్వ లక్షణాలే లక్ష్యం:..
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశం వికసిత్ భారత్ గా మారాలంటే సాంతికత మరియు ప్రజాస్వామ్య విలువలు రెండు ఒకే వేదిక పైకి రావాలని మా విద్యార్థులు ఈ రెండింటిని అద్భుతంగా ప్రదర్శించారని వారిని అభినందించారు. పుస్తకాల్లోని పాఠాలను క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా నేర్పడమే తమ ఉద్దేశమని తెలిపారు. ప్రిన్సిపాల్ శిరీన్ ఖాన్ మాట్లాడుతూ, ఇలాంటి వినూత్న ప్రయోగాలు విద్యార్థుల్లో నాయకత్వ పటిమను, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రధానోపాధ్యాయురాలు శిరిన్ ఖాన్, ఉపాధ్యాయులు కృష్ణ, జాకీర్, అమల్ స్టేన్ఫీల్డ్ స్లే, శంకర్, భానుచందర్ ముఖ్య భూమిక పోషించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని, ప్రజాస్వామ్య విలువలను చాటిచెప్పారు. జన్నారం ప్రాంతంలో ఒక పాఠశాల స్థాయిలో ఇలాంటి డిజిటల్ విప్లవం రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



