Saturday, November 22, 2025
E-PAPER
Homeఖమ్మంఊట బావుల నుంచి మోటార్ల దాకా… 

ఊట బావుల నుంచి మోటార్ల దాకా… 

- Advertisement -

– పల్లె జీవన మార్పులకు అద్దం..
నవతెలంగాణ – అశ్వారావుపేట

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న కొద్దీ ప్రజల జీవనశైలి వేగంగా మారుతోంది. ఒకప్పుడు పట్టణాల్లో మాత్రమే కనిపించే సౌకర్యాలు నేడు గ్రామాల దాకా చేరి పల్లెవాసుల రోజువారీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. రవాణా విస్తరణ, విద్యుత్ సరఫరా మెరుగుదల,ఆధునిక పరికరాల లభ్యత తో నేడు అనేక గ్రామాలు ఒక మోస్తరు పట్టణాన్ని తలపిస్తున్నాయి. అలాంటి మార్పుకు అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి లోని ఊటబావి మంచి ఉదాహరణ. దాదాపు (50 ఏళ్ల క్రితం నిర్మించిన) ఈ బావి నుంచే గ్రామస్తులు గిలక తాడు,బకెట్ సహాయంతో నీటిని తోడి నిత్యావసర అవసరాలు తీర్చుకునేవారు. ఆ కాలంలో ఇది గ్రామ జీవనానికి ప్రధాన ఆధారం.

కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
విద్యుత్ విస్తరణ, తక్కువ ధరలకు మోటార్లు అందుబాటులోకి రావడంతో, ఈ బావి చుట్టుపక్కల ఉన్న కుటుంబాలన్నీ మోటార్లు అమర్చి, నీటిని నేరుగా ఇంటి పైభాగంలోని ట్యాంకులకు పంపేలా మారిపోయాయి. ఇక గిలక తిప్పే శ్రమ, బకెట్ లాగుడు బాదర బందీ ఏమీ లేకుండా పడక గదిలో బటన్ నొక్కితే నీరు ట్యాంకు లో నిండిపోతుంది.

ఒకప్పుడు కూల్చలేని సంప్రదాయ జీవనం… నేడు సౌకర్యాలకు అలవాటు పడిన ఆధునిక పల్లె జీవనం. ఈ మార్పు కే ఈ ఊటబావి సాక్ష్యం. నవతెలంగాణ ప్రతినిధి గుమ్మడవల్లి ని సందర్శించినప్పుడు ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి సేకరించిన చిత్రమిది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -