జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియాన్న
నవతెలంగాణ – నెల్లికుదురు
పండ్ల తోటలో పండు ఈగ నివారణ చర్యలు తీసుకునేందుకు తగు సూచనలు చేసినట్లు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి జినుగు మరియన్న తెలిపారు. మండలంలో సాగులో ఉన్న పలు ఉద్యాన పంటలను పరిశీలించి రైతులకు పలు సలహాలు, సూచనలు మంగళవారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా జామ, తీగ జాతి కూరగాయలు, మామిడి తదితర పంటలలో పండు ఈగ ఆశించి, నష్టం చేస్తుందని, నివారణకు వేపనూనె కలిపి సిఫార్సు చేసిన రసాయన మందులు పిచికారితో పాటు, పండు ఈగ ఎరలు, ఆకర్ష్ జెల్ లాంటి పద్దతులు పాటించి సమర్ధవంతంగా నివారించుకోవాలని అన్నారు. ఇలా చేసినట్లయితే రైతుకు అధిక దిగుబడి వచ్చి లాభాలు చేకూర్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కార మార్గం చూపిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు నర్సయ్య, సంతోష్, బిందు సేద్య జిల్లా కోఆర్డినేటింగ్ బాధ్యులు బి. అశోక్, గడ్డం.ప్రసాద్ బాబు, జి. శరత్ తదితరులు పాల్గొన్నారు.
పండ్ల తోటల్లో పండుఈగ.. నివారణ చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES