Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టిజన్ల సమ్మెకు సంపూర్ణ మద్దతు : సీఐటీయూ

ఆర్టిజన్ల సమ్మెకు సంపూర్ణ మద్దతు : సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విద్యుత్‌ శాఖలోని ఆర్టిజన్ల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బుధవారం ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీఎస్‌ఈబీ రెగ్యులేషన్లను వర్తింపజేయాలనీ, ఇతర అన్ని సౌకర్యాలను కల్పించాలని డిమాండ్‌ చేశారు. కీలక సమయంలో జరుగుతున్న ఈ సమ్మెలో ఒక కేటగిరీ కార్మికులకు వ్యతిరేకంగా మరొక కేటగిరీ కార్మికులను ఎగదోసే యాజమాన్య ఎత్తుగడలను విద్యుత్‌ ఉద్యోగులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టిజన్ల సమ్మె సమయంలో ఉద్యోగులతో ఆ పనులు చేపిస్తే…పీఆర్‌సీ కోసం శాశ్వత ఉద్యోగులు పోరాడే సమయంలో ఆర్టిజన్లతో యాజమాన్యం పని చేయించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి తరుణంలో గరిష్ట ఐక్యతతో యాజమాన్య ఎత్తుగడలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టిజన్ల పోరాటానికి ప్రజలు, ఉద్యోగులు సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -