నవతెలంగాణ – మద్నూర్
మల్లాపూర్ గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు రూ.20 లక్షల నిధులు మంజూరు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నూతన భవన నిర్మాణానికి గురువారం మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధికి పాటుపడే నాయకుడు ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అని అన్నారు. ఎలాంటి అభివృద్ధి పనులకైనా ఎమ్మెల్యే పట్టుదలతో పని చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని వైస్ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, అలాగే ఉమాకాంత్ పటేల్, లక్ష్మణ్ పటేల్, దీన్ దయాల్ పటేల్, గైక్వాడ్ విలాస్, కాంగ్రెస్ కార్యకర్తలు శెట్టివారి రాజు, సంతోష్, అమృత్వార్ శ్రీకాంత్, జిపి సెక్రెటరీ ప్రమోద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్ జీపీ నూతన కార్యాలయానికి నిధులు మంజూరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES