- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి గ్రామ మాజీ సర్పంచ్ గాయక్వాడ్ రాజాబాయి కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ నా పైన నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావుకు, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జునరావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఐ కమాండ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికైన సందర్భంగా జిల్లా ప్రజలకు డోంగ్లి మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఉగాది పర్వదినం అలాగే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -



