Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఎస్పీ నూతన జిల్లా అధ్యక్షుడిగా గంధమల్ల లింగ స్వామి

బీఎస్పీ నూతన జిల్లా అధ్యక్షుడిగా గంధమల్ల లింగ స్వామి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా బహుజన సమాజ్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడుగా  గంధమల్ల లింగ స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా బీఎస్పీ , సెంట్రల్,రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గౌ. ఇబ్రమ్  ఇబ్రహీం ఈ సమావేశంలో ప్రకటించి జిల్లా అధ్యక్షులు గా  బాధ్యతలను  అందజేశారు. 2019లో సామాన్య కార్యకర్తగా బీఎస్పీ పార్టీ చేరి వార్డు సభ్యులు గా గెలిచి మండల, నియోజకవర్గ,జిల్లా ఉపాధ్యక్షుడు , ఇంఛార్జిగా పార్టీలో పదవులు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజా సమస్యలపై  పోరాడుతూ పార్టీని బలోపేతం చూస్తానని అన్నారు.బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం దెయ్యంగా బీఎస్పీ పార్టీ పనిచేస్తుంది అని పేర్కొన్నారు. మొట్ట కొండూరు మండలం, నాంచారిపేట గ్రామవాసి ఇతనిది.నా ఎన్నికకు సహకరించినా పార్టీ నాయకులు, కార్యకర్తలు నా  శ్రేయోభిలాషులకు  పేరు పేరు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -