నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని గండివేట్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు చిటికె రమేష్, పాలకుర్తి శివకుమార్, గండివేట్ తండా నెనావత్ నర్సింగ్ లు కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ శాసనసభ్యులు సురేందర్ నాయకత్వంలో పనిచేయడానికి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మరియు ప్రస్తుత ఎమ్మెల్యే ఇచ్చిన అబద్ధపు హామీలు బూటకపు మాటలకు విసిగిపోయి పార్టీకి రాజీనామా చేశారని తెలిపారు. రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే సాధ్యం అని తెలిపారు. గాంధారి మండల నాయకుల సమక్షంలో వారిని పార్టీలోకి ఆహ్వానించి మాజీ ఎమ్మెల్యే సురేందర్ పార్టీలోకి వచ్చిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ లో చేరిన గండివేట్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES