ఎస్సై విజయ్ కొండ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు
నవతెలంగాణ – మద్నూర్
గల్లీ గల్లీలో కొలువుదీరిన గణనాథులు శనివారం 11వ రోజు గంగమ్మ ఒడిలోకి చేరారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం మహిళలు యూత్ అమ్మాయిల కోలాటలు డ్యాన్సులతో ప్రజలకు ఆకట్టుకున్నాయి. 11 రోజులపాటు పూజలు అందుకున్న గణనాథులు శనివారం ఆటపాటలతో మండల కేంద్రంలో ఊరేగింపుగా మైసమ్మ చెరువుకు చేరుకొని గంగమ్మ ఒడిలోకి చేరాయి. మండల కేంద్రంలో గల్లి గల్లి లో 11 రోజులు పండుగ వాతావరణం నెలకొన్నది. శనివారం నిమజ్జన కార్యక్రమాలతో బ్యాండ్ బాజా భజంత్రీలతో ఆటపాటలతో మండల కేంద్రం దద్దరిల్లింది. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై విజయ్ కొండ ఆద్వర్యంలో పోలీస్ బందోబస్తు చేశారు. నిమజ్జన కార్యక్రమానికి రెవెన్యూ ఇనిస్పెక్టర్ శంకర్ సమక్షించారు నిమజ్జన మైసమ్మ చెరువు వరకు రహదారి శుభ్రత లైటింగ్ క్రేన్ల ఏర్పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ ముమ్మర్ ఏర్పాట్లు చేశారు.
మద్నూర్ లో ఘనంగా గణేష్ నిమజ్జనాల శోభయాత్ర..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES