Tuesday, March 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణేష్ మరణం ఉద్యమానికి తీరని లోటు..

గణేష్ మరణం ఉద్యమానికి తీరని లోటు..

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎం.ఏ.ఇక్బాల్
నవతెలంగాణ – ఆలేరు రూరల్ 

గణేష్ మరణం ఆలేరు ప్రాంత యువజన ఉద్యమానికి,ప్రజాతంత్ర పోరాటాలకు తీరని లోటు అని సిపిఐ (ఎం) జిల్లా నాయకులు ఎం.ఏ.ఇక్బాల్  తెలిపారు. సీపీఐ(ఎం) ఆలేరు పట్టణ మాజీ నాయకుడు, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బోనగిరి గణేష్ తొలి వర్ధంతి సందర్భంగా ఆలేరు పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో స్మారక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు.

సభలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎం.ఏ.ఇక్బాల్ మాట్లాడుతూ.. గణేష్ మరణం ఆలేరు ప్రాంత యువజన ఉద్యమానికి,ప్రజాతంత్ర పోరాటాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. విద్యార్థి సంఘం స్థాయి నుంచి తన ఉద్యమ జీవితం ప్రారంభించిన గణేష్, విద్యార్థి దశలోనే సామాజిక సమస్యలపై చురుకుగా స్పందించేవాడని గుర్తుచేశారు. అనంతరం యువజన ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ శాఖ కార్యదర్శి స్థాయికి ఎదిగాడని తెలిపారు. గణేష్ తన జీవితకాలమంతా అట్టడుగు వర్గాలు, పేదలు, కార్మికులు, కర్షకుల హక్కుల కోసం సిపిఎం నాయకత్వంలో జరిగిన ప్రతి పోరాటంలో ముందుండి పోరాడాడని అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల సాధన కోసం బలమైన యువజన ఉద్యమాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని వివరించారు. అనారోగ్యం కారణంగా ఆయన అకాల మరణం ఉద్యమానికి పెద్ద లోటని అభిప్రాయపడ్డారు.

యువత క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ముందుండాలని గణేష్ ఆకాంక్షించేవాడని, ప్రతి సంవత్సరం యువతకు ప్రోత్సాహం అందించే విధంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించేవాడని చెప్పారు. సమాజంలోని అట్టడుగు వర్గాలు, కార్మికులు, కర్షకులు, యువజనులను సమీకరించి బలమైన ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించడమే గణేష్‌కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు మొరిగాడి రమేష్, పీసీఎస్ మాజీ చైర్మన్ మొరిగాడి చంద్రశేఖర్,ఉద్యమానుబంధ నాయకులు బాలరాజు,మొరిగాడి అజయ్,చెన్న రాజేష్, వడ్డేమాన్ విప్లవ్,కాసుల నరేష్, మాదాని నవీన్, యాసారపు ప్రసాద్,మొరిగాడి లక్ష్మణ్, గొడుగు దాస్,కొరుటూరి ఉపేందర్,ఎండి బాబా,శివ, రేగోటి ప్రశాంత్, ఎక్కాలదేవ్  భాస్కర్, చెక్క పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -